IPL 2020 Auction: Royal Challengers Bangalore Release 12 Players,Here Is The Full List

2019-11-16 737

IPL 2020 Auction: Royal Challengers Bangalore on Friday (November 15) released 12 players ahead of the IPL auction to be held on December 19 at Kolkata. It indicates that RCB under a new set of coaching staff is eager to make a serious shuffle to their squad in their quest for their first IPL title.
#IPL2020Auction
#IPL2020
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#delhicapitals
#rajasthanroyals
#sunrisershyderabad

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నాయి. డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుండటంతో ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నాయి. ఆటగాళ్ల బదిలీలు, విడుదలకు శుక్రవారంతో గడువు ముగిసింది.
దీంతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు వేలానికి విడుదల చేశాయి. మొత్తంగా 8 జట్లు 71 మంది ప్లేయర్లను వేలానికి విడుదల చేశాయి. ఇందులో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తంగా 127 మంది ఆటగాళ్లను కొనసాగించాయి.
తమ ప్రధాన ప్లేయర్లను అట్టిపెట్టుకోగా.. వేలంలో సొమ్ము కోసం స్టార్లను సైతం కొన్ని జట్లు వదులుకున్నాయి. కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) అత్యధికంగా 12 మందిని విడుదల చేయగా.. అత్యల్పంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని విడుదల చేసింది.